Wednesday, October 2, 2024

Dasara Bala Tripura Sundari - Durga Puja Vidhanamu - Telugu - శరన్నవరాత్ర బాలత్రిపుర సుందరి అలంకార దుర్గా దేవి పూజ


Bala Tripura Sundari Devi - Story - బాలత్రిపుర సుందరి దేవి కథ




1. ప్రారంభం గణేశ పూజ - https://www.youtube.com/watch?v=Q4iYXRuGjDE


2. ఆచమనము -  https://www.youtube.com/watch?v=DJ39Ze-bDt4

3. sankalpamu - https://www.youtube.com/watch?v=Api7SNl8TLw

4. కలశారాధన - https://www.youtube.com/watch?v=fvC9vWefHK4

5. పసుపు గణపతి పూజ - https://www.youtube.com/watch?v=6V_wleLs7QQ

6. durga దేవి పూజ - https://www.youtube.com/watch?v=ckGmKGgbcew

7. బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి
https://www.youtube.com/watch?v=RDTUsOa8viA
8. నైవేద్యం  -  https://www.youtube.com/watch?v=RuGRpXgkBQ0







శరన్నవరాత్ర దుర్గాదేవీ  పూజా విధానం 

ప్రతి రోజు అలమ్కారమును బట్టి ఆ దేవికి ప్రత్యేకముగా అష్టోత్తరము  చదివి పూజ చేయవలెను.

బాలా త్రిపుర సుందరి అలంకార  దుర్గాదేవీ పూజా విధానం

(విధానము కొన్ని చోట్ల సరళము చేయబడినది)



 ప్రారంభం - గణేశ ప్రార్ధన



__________________

__________________


శుక్లామ్బరధరమ్ విష్ణుమ్  శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయెత్ సర్వ విఘ్నోప శాంతాయే

దీప ప్రజ్వలన 


దీపత్వమ్ బ్రహ్మ రూపేసి  జ్యోతిషాం  ప్రభురవనయహ్
సౌభాగ్యం దేహి పుత్రాన్స్‌చ సర్వాన్ కామాన్‌శ్చ దేహిమ్

దీపమును వెలిగించి దీపపు కున్దిని కుంకుమ అక్షంతాలతో అలంకరీంపవలెను

శ్లో : అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)




ఆచమనం



_________________

_________________


ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః,విష్ణవే నమః,
మధుసూదనాయ నమః,త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః,శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ప్రాణాయామము

(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)


ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్


దసరా పూజ సంకల్పం


_________________


_________________


ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మహా లక్ష్మి ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే
జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే
కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి)
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిన) ఆయనే
(ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే
(ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈరోజు నక్షత్రము) శుభనక్షత్రే

 శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,
శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య
(మీ పూర్తి పేరు) నామధేయస్య
ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిద్యర్ధం,పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం,సర్వదేవతా స్వరూపిణీ బాలా త్రిపుర సుందరి అలంకార  శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్ధం యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే



కలశారాధన




___________________

____________________


శ్లో :  కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)

శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.)


తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.


పసుపు వినాయకుని పూజ


_________________


_________________



మం :  ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

 శ్రీ మహాగణాధిపతి బెల్లము OR పండ్లు గానీ ప్రసాదముగ  నివేదించాలి.  కర్పూర  నీరాజనం దర్శయామి. (కర్పూరమును వెలిగించి చూపవలెను).



శ్రీ దుర్గా  దేవి ఆవాహన పూజ


____________________

____________________


శ్రీ దుర్గా  దేవియే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.

శ్రీ దుర్గా  దేవి యే నమః పాదయోః పాద్యం సమర్పయామి  (నీళ్ళు చల్లవలెను)

శ్రీ దుర్గా   దేవి యే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి  (నీళ్ళు చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)

శ్రీ దుర్గా  దేవియే నమః వస్త్రయుగ్మం సమర్పయామి  (అక్షతలు చల్లవలెను)

శ్రీ దుర్గా   దేవి యే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి  (గంధం చల్లవలెను)

శ్రీ దుర్గా   దేవియే నమః అక్షతాన్ సమర్పయామి  (అక్షతలు చల్లవలెను)



అధాంగ పూజ


ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి
ఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి
ఓం అపర్ణాయై నమః జానునీ పూజయామి
ఓం హరిప్రియాయై నమః ఊరూ పూజయామి
ఓం పార్వత్యై నమః కటిం పూజయామి
ఓం ఆర్యాయై నమః నాభిం పూజయామి
ఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామి
ఓం మంగళాయై నమః కుక్షిం పూజయామి
ఓం శివాయై నమః హృదయం పూజయామి
ఓం మహేశ్వర్యై నమః కంఠం పూజయామి
ఓం విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి
ఓం కాళ్యై నమః బాహూ పూజయామి
ఓం ఆద్యాయై నమః హస్తౌ పూజయామి
ఓం వరదాయై నమః ముఖం పూజయామి
ఓం సువణ్యై నమః నాసికం పూజయామి
ఓం కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి
ఓం అంబికాయై నమః శిరః పూజయామి
ఓం దేవ్యై నమః సర్వాణ్యం పూజయామి


2వ రోజు ప్రత్యెక  పూజ
శ్రీ బాలా త్రిపురసుందరి అష్టోత్తర శతనామావళి

https://www.youtube.com/watch?v=RDTUsOa8viA

 అక్షతలు ,పుష్పములు పూజ చెయ్యండి


___________________


____________________

 శ్రీ బాలా త్రిపురసుందరి అష్టోత్తర శతనామావళి
https://www.youtube.com/watch?v=RDTUsOa8viA

శ్రీ బాలా త్రిపురసుందరి అష్టోత్తర శతనామావళి

ఓం కళ్యాణ్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం బాలాయై
ఓం మాయాయై నమః
ఓం త్రిపురసుందర్యై నమః


ఓం సుందర్యై నమః
ఓం సౌభాగ్యవత్యై నమః
ఓం క్లీంకార్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం హ్రీంకార్యై నమః


ఓం స్కందజనన్యై నమః
ఓం పరాయై నమః
ఓం పంచదశాక్షర్యై నమః
ఓం త్రిలోక్యై నమః
ఓం మోహనాధీశాయై నమః


ఓం సర్వేశ్వర్యై నమః
ఓం సర్వరూపిణ్యై నమః
ఓం సర్వ సంక్షోభిణ్యై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం నవముద్రేశ్వర్యై నమః


ఓం శివాయై నమః
ఓం అనంగకుసుమాయై నమః
ఓం ఖ్యాతాయై
ఓం అనంగాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః


ఓం జప్యాయై నమః
ఓం స్తవ్యాయై నమః
ఓం శ్రుత్యై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిత్యక్లిన్నాయై నమః


ఓం అమృతోద్బభవాయై నమః
ఓం మోహిన్యై నమః
ఓం పరమాయై నమః
ఓం ఆనందదాయై నమః
ఓం కామేశ్యై నమః

ఓం తరణాయై నమః
ఓం కళాయై నమః
ఓం కళావత్యై నమః
ఓం భగవత్యై నమః
ఓం పద్మరాగకిరీటన్యై నమః


ఓం సౌగంధిన్యై నమః
ఓం సరిద్వేణ్యై నమః
ఓం మంత్రిణ్యై నమః
ఓం మంత్రరూపిణ్యై నమః
ఓం తత్త్వత్రయ్యై నమః


ఓం తత్త్వమయ్యై నమః
ఓం సిద్దాయై నమః
ఓం త్రిపురవాసిన్యై నమః
ఓం శ్రియై
ఓం మత్యై నమః

ఓం మహాదేవ్యై నమః
ఓం కౌళిన్యై నమః
ఓం పరదేవతాయై నమః
ఓం కైవల్యరేఖాయై నమః
ఓం వశిన్యై నమః

ఓం సర్వేశ్వర్యై నమః
ఓం సర్వమాతృకాయై నమః
ఓం విష్ణుస్వశ్రేయసే నమః
ఓం దేవమాత్రే నమః
ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః


ఓం కింకర్యై నమః
ఓం మాత్రే నమః
ఓం గీర్వాణ్యై నమః
ఓం సురాపానామోదిన్యై నమః
ఓం ఆధారాయై నమః

ఓం హితపత్నికాయై నమః
ఓం స్వాధిస్ఠానసమాశ్రయాయై నమః
ఓం అనాహతాబ్జనిలయాయై నమః
ఓం మణిపూర సమాశ్రయాయై నమః 
ఓం ఆజ్ఞాయై నమః

ఓం పద్మాసనాసీనాయై నమః
ఓం విశుద్దస్థలసంస్థితాయై నమః
ఓం అష్టత్రింశత్కళామూర్త్యై నమః
ఓం సుషుమ్నాయై నమః
ఓం చారుమధ్యాయై నమః

ఓం యోగేశ్వర్యై నమః
ఓం మునిద్యేయాయై నమః
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రచూడాయై నమః

ఓం పురాణాగమరూపిణ్యై నమః
ఓం ఐంకారారాదయే నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం పంచప్రణవరూపిణ్యై నమః
ఓం భూతేశ్వర్యై నమః


ఓం భూతమయ్యై నమః
ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః
ఓం షోడశన్యాసమహాభూషాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం దశమాతృకాయై నమః

ఓం ఆధారశక్యై నమః
ఓం తరుణ్యై నమః
ఓం లక్ష్మ్యై  నమః
ఓం త్రిపురభైరవ్యై నమః
ఓం శాంభవ్యై నమః


ఓం సచ్చిదానందాయై నమః
ఓం సచ్చిదానందరూపిణ్యై నమః
ఓం మాంగల్ల్యదాయిన్యై నమః
ఓం మాన్యాయ్యై నమః
ఓం సర్వమంగళాకారిణ్యై నమః

ఓం యోగలక్ష్మ్యై నమః
ఓం భోగలక్ష్మ్యై నమః
ఓం రాజ్యలక్ష్మ్యై నమః
ఓం త్రికోణగాయై నమః
ఓం సర్వసౌభాగ్యసంపన్నాయై నమః

ఓం సర్వసంపత్తిదాయిన్యై నమః
ఓం నవకోణపురావాసాయై నమః
ఓం బిందుత్రయసమన్వితాయై నమః








నైవేద్యము


___________________

____________________

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ దుర్గా   దేవి యే నమః  (ప్రసాదం నివేదయామి).

ఓం ప్రాణాయస్వాహా, ఓమ్ అపానాయస్వాహా, ఓంవ్యానాయ స్వాహా
ఓమ్ ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.  (నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి. (తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)



శ్రీ దుర్గా  దేవి యే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ దుర్గా దేవి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొనిదేవుని వద్దగల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)



  శ్రీ  బాలత్రిపుర సుందరి అలంకార దుర్గా  దేవి పూజ సమాప్తం.

_________



Ud. 3.10.2024
Pub. 27.9.2022

1 comment:

  1. 2023 - ఈ సంవత్సరము మొదటి రోజు అలంకారము బాలా త్రిపుర సుందరి.

    ReplyDelete