దసరా నవరాత్రి శ్రీ చండీదేవి అలంకార దుర్గా దేవి పూజ - పూజా విధానం.
శరన్నవరాత్ర దుర్గాదేవీ పూజా విధానం
నవరాత్రిలో ప్రతిదినము చేయవలసిన పూర్తి పూజ (Text)
వీడియోలు
1. ప్రారంభం గణేశ పూజ - https://www.youtube.com/watch?v=Q4iYXRuGjDE
2. ఆచమనము - https://www.youtube.com/watch?v=DJ39Ze-bDt4
3. సంకల్పము - https://www.youtube.com/watch?v=Api7SNl8TLw
4. కలశారాధన - https://www.youtube.com/watch?v=fvC9vWefHK4
5. పసుపు గణపతి పూజ - https://www.youtube.com/watch?v=6V_wleLs7QQ
6. దుర్గా దేవి పూజ ఆవాహన - https://www.youtube.com/watch?v=ckGmKGgbcew
7. శ్రీ దుర్గా దేవి అష్టోత్తర శతనామావళి https://www.youtube.com/watch?v=8JV8hDxR4r0
8. శ్రీ చండీ అష్టోత్తరశత నామావళి
నైవేద్యం
9. నైవేద్యం - https://www.youtube.com/watch?v=RuGRpXgkBQ0
శ్రీ చండీ అష్టోత్తరశత నామావళి
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం జయంత్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం లజ్జాయై నమః
ఓం భగవత్యై నమః
ఓం వంద్యాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం పాపనాశిన్యై నమః
ఓం చండికాయై నమః
ఓం కాళరాత్ర్యై నమః
ఓం భద్రకాళ్యై నమః
ఓం అపరాజితాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహామేధాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం జయాయై నమః
ఓం దుర్గాయై నమః
ఓం మందారవనవాసిన్యై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం గిరిసుతాయై నమః
ఓం ధాత్ర్యై నమః,
ఓం మహిషాసురఘాతిన్యై నమః
ఓం సిద్ధియై నమః
ఓం బుద్ధిదాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం వరదాయై నమః
ఓం వరవర్ణిన్యై నమః
ఓం అంబికాయై నమః
ఓం సుఖదాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం శివప్రియాయై నమః
ఓం భక్తసంతాపసంహర్యై నమః
ఓం సర్వకామప్రపూరిణ్యై నమః
ఓం జగత్కర్యై నమః
ఓం జగద్ధాత్ర్యై నమః
ఓం జగత్పాలనతత్పరాయై నమః
ఓం అవ్యక్తాయై నమః
ఓం వ్యక్తరూపాయై నమః
ఓం భీమాయై నమః
ఓం త్రిపురసుందర్యై నమః
ఓం అపర్ణాయై నమః
ఓం లలితాయై నమః
ఓం విద్యాయై నమః
ఓం పూర్ణచంద్ర నిభాననాయై నమః
ఓం చాముండాయై నమః
ఓం చతురాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం గుణత్రయవిభాగిన్యై నమః
ఓం హేరంబజనన్యై నమః
ఓం కాళ్యై నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం యశోధరాయై నమః
ఓం ఉమాయై నమః
ఓం కలశహస్తాయై నమః
ఓం దైత్యదర్పనిఘాదివ్యై నమః
ఓం బుద్ద్యె నమః
ఓం కాంత్యై నమః
ఓం క్షమాయై నమః
ఓం శాంత్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం తుష్ట్యై నమః
ఓం ధృత్యై నమః
ఓం మత్యై నమః
ఓం వరాయుధధగాయై నమః
ఓం ధీరాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం శాకంభర్యై నమః
ఓం శివాయై నమః
ఓం అష్టసిద్ధి ప్రదాయై నమః
ఓం వామాయై నమః
ఓం శివవామాంగవాసిన్యై నమః
ఓం ధర్మదాయై నమః
ఓం ధనదాయై;
శ్రీదాయై నమః
ఓం కామదాయై నమః
ఓం మోక్షదాయై నమః
ఓం అపరాయై నమః
ఓం చిత్స్వరూపాయై నమః
ఓం చిదానందాయై నమః
ఓం జయశ్రియై నమః
ఓం జయదాయిన్యై నమః
ఓం సర్వమంగళ మాంగల్యాయై నమః
ఓం జగత్రయ హితైషిణ్యై నమః
ఓం శర్వాణ్యై నమః
ఓం పర్వాత్యై నమః
ఓం ధన్యాయై నమః
ఓం స్కందమాత్రే నమః
ఓం అఖిలేశ్వర్యై నమః
ఓం ప్రసన్నార్తిహరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం సుభగాయై నమః
ఓం కామరూపిణ్యై నమః
ఓం నిరాకారాయై నమః
ఓం సాకారాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం సురేశ్వర్యై నమః
ఓం శర్వాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం ధ్రువాయై నమః
ఓం కృత్యాయై నమః
ఓం మృఢాన్యై నమః
ఓం భక్తవత్సలాయై నమః
ఓం సర్వశక్తి సమాయుకాయై నమః
ఓం శరణ్యాయై నమః
ఓం సత్యకామదాయై నమః
శ్రీ చండీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
మంగళ చండీదేవి చరితము
శ్రీ నారాయణు డిట్లనెను ః బ్రహ్మపుత్రా ! నారదా ! మంగళ చండీదేవి మహాఖ్యానము చక్కగ నాలకింపుము.
పరాత్పర యగు నామెను మొట్టమొదట శివుడు త్రిపురములు సంహరించు సమయమున విష్ణు ప్రేరణచేత పూజించెను. శివుని విమానమును త్రిపురా సురుడు దివినుంచి క్రిందికి కోపముతో పడవేసెను. అట్టి ఘోర సంకటమున బ్రహ్మ శివునకు మంగళ చండిని గూర్చి తెల్పెను. అపుడు శివుడు బ్రహ్మ-విష్ణుల యాదేశము ప్రకారము దుర్గను నుతించెను.
శివుడంత భక్తితో మంగళ చండికను సంపూజించెను. పాద్యము-అర్ఘ్యము-ఆచమనీయము- పలువిధములైన వస్త్రములును శివుడు దేవి కొసంగెను. పుష్ప చందనములతోపలువిధములైన నైవేద్యములతో మేకలు-గొఱ్ఱలు-ఎనుబోతులు-పల్లావులు-పక్షులు మున్నగువాని బలులతో వస్త్రాలంకారమలతో పూలదండలతో పాయసముతో పిండి వంటలతో తేనెతో పలువిధములైన పండ్లతో సంగీత నర్తనములతో వాద్యములతో నామసంకీర్తన మహోత్సవములతో మాధ్యందినమున తెలుపబడిన ధ్యానము ప్రకారముగ శివుడు భక్తితో మంగళ చండికను ధ్యానించెను. నారదా ! శివుడు మూల మంత్రముతో " ఓం హ్రీం శ్రీం క్లీం సర్వ పూజ్యే దేవి మంగళ చండికే. హు హుం ఫట్ స్వాహా '' ద్రవ్యములు దేవి కర్పించెను. ''
ఆమెయే మాఱు రూపమున మంగళ చండి యయ్యెను. ఆమె శంభునితో నీకు భయము లేదని ప్రత్యక్షముగ చెప్పెను. విష్ణువు సర్వేశుడు. అతడు నీకు వృషభ వాహనము గాగలడు. నేను తప్పక యుద్ధ శక్తి స్వరూపిణినైనీ కండగ నిల్తును. శివా ! అపుడు నీవు నా సాయమున హరి సాయమున జయింపగలవు. సురల పదచ్యుతులను చేసిన దానవుని సంహరింపుము. అని శివునితో బలికి దేవి అంతర్హిత యయ్యెను. శివుడపుడు విష్ణు వొసంగిన యస్త్రముతో దానవుని చంపెను.
ఓం హ్రీం శ్రీం క్లీం సర్వ పూజ్యే దేవి మంగళ చండికే. హు హుం ఫట్ స్వాహా '' అనునదిరువదొక యక్షరముల మంత్రము. ఇది భక్తులకు కల్పతరువు. సర్వకామము లొసగునది. పూజ్యమైనది. దీనిని పది లక్షలు జపించిన ధ్రువముగ మంత్రసిద్ధి గల్గును. నారదా ! వేదోక్త ప్రకారము సర్వ సమ్మతమునగు ధ్యానము వినుము. పదారు వత్సరముల దేవి - నిండైన జవ్వనము గలది - బింబాధర-సుదతి-శుద్ధ- శారద కమలమువంటి ముఖము గలది. శ్వేతచంపకమువంటి కాంతి గలది. నల్ల కలువలవంటి కన్నులు గలది. ఎల్లరికీ సకల సంపద లొసంగునది-జగముల తల్లి-సకలదాయిని-సంసార సాగరమందు జ్యోతిః స్వరూపిణి యగు దేవిని కొల్తును. నారదా ! ఇది ధ్యానము.
ఇక స్తోత్రము వినుము.
రక్ష రక్ష జగన్మాత ర్దేవి మంగళచండికే | హారికే విపదాంరాశేర్హర్ష మంగళకారికే.
హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయికే | శుభే మంగళదక్షే చ శుభే మంగళచండికే.
మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే | సతాం మంగళదే దేవి సర్వేషాం మంగళాలయే.
పూజ్యే మంగళవారే చ మంగళాభీష్టదేవతే | పూజ్యే మంగళభూపస్య మనువంశస్య సంతతమ్.
మంగళాధిష్ఠాతృ దేవి మంగళానం చ మంగళే | సంసార మంగళాధారేమోక్షమంగళదాయిని.
మహాదేవుడిట్లనెను ః జగన్మాతా ! మంగళదాయినీ ! ఆనందకారిణీ ఆపదలుపాపు తల్లీ ! దేవి మంగళ చండికా ! నన్ను బ్రోవుము బ్రోవుము- ఆనంద మంగళదాయినీ ! ఆనంద మంగళ ప్రవీణా ! శుభమంగళ పరాయణా ! శుభా! మంగళచండికా ! తల్లీ మంగళాదేవీ ! మంగళయోగ్యా ! సర్వమంగళమంగళా సాధుజనులకు శుభములొసగు జననీ! శుభ మంగళనిలయా ! మంగళవార పూజ్య! మంగళాభీష్ట దేవీ ! మనువంశమున జన్మించిన మంగళ రాజుచేత పూజలందుకొనిన తల్లీ! ఓహో మంగళాధిష్ఠాన దేవీ ! మంగళ మంగళా ! సంసార మంగళాధారిణి! ముక్తి మంగళదాయినీ! మంగళకారిణీ ! మంగళాధారా ! సకల కర్మలకు పరాకాష్ఠా ! ప్రతి మంగళవారమున పూజనీయా ! మంగళసుఖప్రదా ! నీకు నమస్కారము నన్ను బ్రోవుము.
మొట్టమొదట సర్వమంగళయగు చండికాదేవిని శివుడు పూజించెను. తర్వాత మంగళగ్రహము (కుజుడు) మండళచండికను పూజించెను. ఆ తర్వాత మంగళుడను రాజు భద్ర మంగళదేవి నర్చించెను. ఆ పిదప ప్రతి మంగళవారమున సుందర స్త్రీలు మంగళ నారాధించిరి. ఐదవసారి శుభముగోరు నరులచేత మంగళచండిక పూజింపబడెను. తర్వాత ప్రతి విశ్వమునందు శివపూజితయగు మంగళ పూజింపబడెను. మునీ ! అటు పిమ్మట మంగళ పరమేశ్వరి యెల్లెడల దేవ-ముని-మను-నరులచేత పూజింపబడెను. ఈ మంగళదేవిస్తోత్రము నిశ్చల మనస్సుతో వినువాడు శుభములు పడయును. అతని కమంగళము గలుగదు.
https://kamakoti.org/telugu/66/112.htm
శ్రీదేవీ భాగవతమ్ - Chapters 2 Volume
https://kamakoti.org/telugu/66/chapters.htm
Chandidevi Temple - Hardwar
Chandidevi Temple is one of the popular shaktipeethas in Haridwar, North India. Located atop Neel Parvat, Chandidevi temple is one of the most ancient temples of north India.Chandidevi temple is also called siddhapitha as it is believed that the Goddess Chandi fulfills the wishes of her devotees. Chandidevi alongwith Mansadevi and Mayadevi temple form a Siddhapeeth triangle in the holy city of Hardwar. The temple is situated at the hilltop near Haridwar.
The main image at Chandidevi temple is said to have been installed by Adi Shankaracharya in 8th century A.D.
The demon kings Shumbh and Nishumbh had captured the kingdom of Lord Indra and thrown out gods from heaven. After intense prayers, Chandika Devi appeared from the cells of the body of Goddess Parvathi. She assumed the form of an exceptionally beautiful woman and Shumbh desired to marry her.
On being refused, Shumbh sent his demon chiefs Chanda and Munda to kill her. They were killed by Kalika devi born out of Chandika Devis anger. Shumbh and Nishumbh then attacked Chandika Devi but were slain by the Goddess. Thereafter Chandika Devi is said to have rested for a short while at the temple location.
శ్రీ చండీదేవి ప్రతిమాలక్షణము
https://www.kamakoti.org/telugu/79/50.htm
Ud. 6.10.2024
Pub. 18.10.2023
Updated on 6.10.2024
ReplyDelete213 views/hits so far in this week.
ReplyDelete