Monday, October 7, 2024

Devi Suktam - Sri Suktam - Saraswati Suktam --- దేవీ సూక్తము - శ్రీ సూక్తము - సరస్వతీ సూక్తము

 

ఆశ్వయుజ శుద్ధ సప్తమి,  బుధవారము, 9-10-2024  -  #దసరా నవరాత్రి  శ్రీ  సరస్వతీదేవి  అలంకార దుర్గా దేవి పూజ. 

Saraswati Suktam  వినండి . 

https://www.youtube.com/watch?v=_DJ8Pgbep9Y  (With Nagari and English Script Text)




#దసరా శుభాకాంక్షలు.

విజయదశమి శరన్నవరాత్ర దుర్గాదేవీ పూజా విధానం 

Dasara Puja - Durga Puja Vidhanamu - Vivaramulu - Telugu 

http://guide-india.blogspot.com/2012/01/dasara-puja-durga-puja-vidhanamu.html


From Rigveda - For Dasara Nine Days - Navratri: 

Devi Suktam - Sri Suktam - Saraswati Suktam

దేవీ సూక్తము  - శ్రీ   సూక్తము  - సరస్వతీ  సూక్తము


దుర్గాష్టమి,  - శ్రీ దుర్గా దేవి

Devi Suktam

https://www.youtube.com/watch?v=9Cf30UbYnlg   (With text)

https://en.wikipedia.org/wiki/Dev%C4%ABs%C5%ABkta


The Rig Veda/Mandala 10/Hymn 125

https://en.wikisource.org/wiki/The_Rig_Veda/Mandala_10/Hymn_125


 శ్రీ మహాలక్ష్మిదేవి అలంకారము

శుభోదయము. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, మంగళవారము,  8.10.2024  -  #దసరా నవరాత్రి  శ్రీ  మహాలక్ష్మీదేవి అలంకార దుర్గా దేవి పూజ -   పూజా విధానం.

http://guide-india.blogspot.com/2013/10/sri-mahalakshmi-devi-puja-navaratri-day.html


Sri Suktam

The Ghanapati Channel



Saraswati Suktam

https://www.youtube.com/watch?v=_DJ8Pgbep9Y  (With Nagari and English Script Text)

Saraswati Suktam in the video contains suktas from various mandalas of Rig Veda

Mandala 1 Sukta 3

१२ मधुच्छन्दा वैश्वामित्रः। १-३ अश्विनौ, ४-६ इन्द्र, ७-९ विश्वेदेवाः,

१०-१२ सरस्वती। गायत्री।

------------------------

अश्वि॑ना॒ यज्व॑री॒रिषो॒ द्रव॑त्पाणी॒ शुभ॑स्पती। पुरु॑भुजा चन॒स्यत॑म्॥१॥

अश्वि॑ना॒ पुरु॑दंससा॒ नरा॒ शवी॑रया धि॒या। धिष्ण्या॒ वन॑तं॒ गिर॑:॥२॥

दस्रा॑ यु॒वाक॑वः सु॒ता नास॑त्या वृ॒क्तब॑र्हिषः। आ या॑तं रुद्रवर्तनी॥३॥

इन्द्रा या॑हि चित्रभानो सु॒ता इ॒मे त्वा॒यव॑:। अण्वी॑भि॒स्तना॑ पू॒तास॑:॥४॥

इन्द्रा या॑हि धि॒येषि॒तो विप्र॑जूतः सु॒ताव॑तः। उप॒ ब्रह्मा॑णि वा॒घत॑:॥५॥

इन्द्रा या॑हि॒ तूतु॑जान॒ उप॒ ब्रह्मा॑णि हरिवः। सु॒ते द॑धिष्व न॒श्चन॑:॥६॥

ओमा॑सश्चर्षणीधृतो॒ विश्वे॑ देवास॒ आ ग॑त। दा॒श्वांसो॑ दा॒शुष॑: सु॒तम्॥७॥

विश्वे॑ दे॒वासो॑ अ॒प्तुर॑: सु॒तमा ग॑न्त॒ तूर्ण॑यः। उ॒स्रा इ॑व॒ स्वस॑राणि॥८॥

विश्वे॑ दे॒वासो॑ अ॒स्रिध॒ एहि॑मायासो अ॒द्रुह॑:। मेधं॑ जुषन्त॒ वह्न॑यः॥९

पा॒व॒का न॒: सर॑स्वती॒ वाजे॑भिर्वा॒जिनी॑वती। य॒ज्ञं व॑ष्टु धि॒याव॑सुः॥१०॥

चो॒द॒यि॒त्री सू॒नृता॑नां॒ चेत॑न्ती सुमती॒नाम्। य॒ज्ञं द॑धे॒ सर॑स्वती॥११॥

म॒हो अर्ण॒: सर॑स्वती॒ प्र चे॑तयति के॒तुना॑। धियो॒ विश्वा॒ वि रा॑जति॥१२॥

https://vedicheritage.gov.in/samhitas/rigveda/shakala-samhita/m01-003/

6-61

इयमददाद् रभसमृणच्युतं दिवोदासं वध् रयश्  वाय दादुषे ।

या शश् वन्तमाचखादावसं पणिं ता ते दात्राणि तविषा सरस्वति ॥ १ ॥

इयं शुष्मेभिर्बिसखा इवारुजत् सानु गिरीणां तविषेभिरुर्मिभिः ।

पारावतघ्नीमवसे सुवृक्तिभिः सरस्वतीमा विवासेम धीतिभिः ॥ २ ॥

सरस्वति देवनिदो निबर्हय प्रजां विश् वस्य बृसयस्य मायिनः ।

उत क्षितिभ्योऽवनीरविन्दो विषमेभ्यो अस्त्रवो वाजिनीवति ॥ ३ ॥

प्रणो देवि सरस्वती वाजेभिर्वाजिनीवती । धीनामवित्र्यवतु । ॥ ४ ॥

यस्या देवि सरस्वत्युपब्रूते धने हिते । इन्द्रं न वृत्रतूर्ये ॥ ५ ॥     

त्वं देवि सरस्वत्यवा वाजेषु वाजिनि । रदा पूषेव नः सनिम् ॥ ६ ॥

उत स्या नः सरस्वती घोरा हिरण्यवर्तनिः ।

वृत्रघ्नी वष्टि सुष्टुतिम् ॥ ७ ॥

यस्या अनन्तो अर्‍हुतस्त्वेषश् चेरिष्णुरर्णवः ।

अमश् चरति रोरुवत् ॥ ८ ॥

सा नो विश् वा अति द्विषः स्वसृरन्या ऋतावरी ।

अतन्नहेव सूर्यः ॥ ९ ॥

उत नः प्रिया प्रियासु सप्तस्वसा सुजुष्टा ।

सरस्वती स्तोम्या भूत् ॥ १० ॥

आपप्रुषी पार्थिवान्युरु रजो अन्तरिक्षम् । 

सरस्वती निदस्पातु ॥ ११ ॥

त्रिषधस्था सप्तधातुः पञ्च जाता वर्धयन्ती ।

वाजेवाजे हव्या भूत् ॥ १२ ॥

प्र या महिम्ना महिनासु चेकिते द्युम्नेभिरन्या अपसामपस्तमा ।

रथ इव बृहति विभ्वने कृतोपस्तुत्या चिकितुषा सरस्वती ॥ १३ ॥

सरस्वत्यभि नो नेषि वस्यो माप स्फरीः पयसा मा न आ धक् ।

जृषस्व नः सख्या वेश्याच मा त्वत् क्षेत्राण्यरणानि गन्म ॥ १४ ॥

॥ ऋग्वेद ६-६१ ॥



http://ioustotra.blogspot.com/2016/10/saraswati-sukta.html




Sri Suktam

Video

The Ghanapati Channel

ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్

చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ


ఓ అగ్నిదేవా! బంగారు మేని ఛాయ గల, పాపాలను నాశనము చేసే, బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడిన, చంద్రుని వలె చల్లగా ఆహ్లాదకరంగా, సువర్ణమయమైన యున్న మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. 

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్

యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్


ఎవరి కరుణ, కటాక్షములతో నాకు బంగారము, ఆవులు, గుర్రాలు, బంధువులు సంప్రాప్తమైనవో ఆ మహాలక్ష్మిని నా వద్దకు ఆవాహనము చేయుము.ఆమె నా వద్ద నుండి వీడిపోకుండా చూడుము. 


అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినా ద ప్రబోధినీమ్

శ్రియం దేవీ ముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్



 గుర్రాలతో ఉన్న రథం మధ్యలో ఆసీనమైనది, తన రాకను ఏనుగు ఘీంకార నాదంతో సూచిస్తున్న ఆ శ్రీదేవిని ఆహ్వానిస్తున్నాను.  తల్లీ నీవు నా వద్ద సంతోషముగా నెలకొని ఉండుము. 


కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా మార్దాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్

పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్


చక్కని చిరునవ్వుతో, బంగారు కోటలో నివసించే, కరుణ, తేజస్సు, ఆనంద రూపిణియై, ఆనందము ప్రసాదించునది, పద్మములో ఆసీనురాలై, పద్మము వంటి ఛాయకలది అయిన ఆ శ్రీదేవిని ఇక్కడ సాక్షాత్కరించమని ప్రార్థిస్తున్నాను. 



చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్

తాం పద్మినీమీం శరణమహాం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే


చంద్రుని పోలినది, తేజోవంతమైనది, తన కీర్తి చంద్రికలతో ప్రకాశించుచున్నది, దేవతలచే పూజిన్చబడుచున్నది, కరుణా స్వరూపిణి, పద్మమును ధరించినది, 'ఈం' అనే బీజమంత్రానికి భావంగా ఉన్నది అయిన మహాలక్ష్మిని నేను శరణు వేడుతున్నాను.

ఓ దేవీ! నిన్ను ప్రార్థిస్తున్నాను, నా దారిద్ర్యం పోయేలా కరుణించు.



ఆదిత్యవర్ణే తపసో ధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వ:

తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ:


 సూర్యుని తేజస్సు కలిగిన ఓ తల్లి! వనానికి అధిపతియైన బిల్వవృక్షం (మారేడు చెట్టు) నీ తపోమహిమచే ఉద్భవించినది. నీ తపస్సు వలన కలిగిన దాని ఫలాలు అజ్ఞానము మనే లోని ఆటంకాన్ని, అమంగళకరమైన బయటి ఆటంకాన్ని తొలగిస్తాయి గాక! 


ఉపెతు మాం దేవసఖ: కీర్తిశ్చ మణినా సహా

ప్రాదుర్భూతో స్మిరాష్ట్రే స్మిన్ కీర్తిమృద్ధిం దదాదుమే


కుబేరుడు, కీర్తి ఐశ్వర్యాలతో నన్ను వెన్నంటి రావాలి. నీ అనుగ్రహం పూర్తిగా నిండిన ఈ దేశంలో నేను జన్మించాను. సకల సంపదలను నాకు ప్రసాదించు!



క్షుత్పిపాసామలాం జ్యేష్ఠా మలక్షీం నాశయామ్యహమ్

అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్


 ఆకలి దప్పికలతో కృశించినది, శ్రీదేవి కంటే ముందుగా జన్మించిన జ్యేష్టాదేవిని (అలక్ష్మి) నేను నాశనం చేస్తాను. నా గృహము నుండి అభాగ్యము, కొరతలను పూర్తిగా నిర్మూలించి నన్ను అనుగ్రహించు.


గందద్వారాం దురాదర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్

ఈశ్వరీగ్మ్ సర్వ భూతానాం తామిహోపహ్వయే శ్రియమ్


సుగంధానికి నిలయమైనది, జయింప అలవికానిది, ఎల్లప్పుడూ పుష్టినిచ్చేది, సకల సంపదలు కలిగిన, సమస్త జీవులకు అధినాయిక యైన మహాలక్ష్మిని ఇక్కడ ఆవాహన చేస్తున్నాను.


మనస: కామకూతిం వాచ: సత్యమశీమహి

పశూనాం రూపమన్యస్య మయి శ్రీ:శ్రయతాం యశ:

  ఓ శ్రీదేవి! మనస్సులో జనించే ఉత్తమమైన కోరికలూ, సంతోషము, వాక్కులో సత్యము, గోసంపద చే, ఆహార సమృద్ధిచే కలిగే ఆనందాన్ని నేను చవి చూడాలి. నాకు కీర్తి కలుగచేయుము. 


కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ

శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్


కర్దమ మహర్షి! నీకు పుత్రికగా జన్మించిన మహాలక్ష్మి నాకు సాక్షాత్కారించాలి. తామరపువ్వుల మాల ధరించిన, సిరిసంపదలకు అధిదేవత, తల్లి అయిన ఆమెను నా కులములో ఎల్లప్పుడూ నివసింప చేయాలి.


ఆప: సృజంతు స్నిగ్దాని చిక్లీత వసమే గృహే

ని చ దేవీం మాతరం శ్రియం వాసయమే కులే


మహాలక్ష్మి పుత్రుడవైన ఓ చిక్లీత! నీరు, చక్కని ఆహారపదార్థాలను ఉత్పత్తి చేయుగాక! నా ఇంట నీవు నివసించాలి. దేవీ, నీ మాత అయిన ఆ మహాలక్ష్మి నా కులములో నిరంతరమూ నివసించేలా అనుగ్రహించు.


ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగలాం పద్మమాలినీమ్

చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ


 ఓ అగ్నిదేవ! కరుణ కలిగిన మనసు కలది, పద్మవాసిని, లోకానికి ఆహారము ఇచ్చి పోషించేది, కుంకుమ రంగు కలది, తామరపువ్వుల మాల ధరించినది, చంద్రునివలె ఆహ్లాదకరమైనది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము.


ఆర్ద్రాం య: కరిణీం యష్టిం సువర్ణామ్ హేమ మాలినీమ్

సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ


అగ్నిదేవా! దయకలిగినది, గంభీరముగా యుండెడిది, దండము చేత బూనినది, అందమైన శరీరచాయ కలిగినది, సూర్యునివలె ప్రకాశించునది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము.


తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమన పగామినీమ్

యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వాన్, విందేయం పురుషానహమ్


 అంతులేని బంగారుము, గోవులు, సేవకులు, గుర్రాలు ప్రాప్తించుకుంటానో , అట్టి మహాలక్ష్మిని నన్ను వదలి వెళ్లిపోకుండా కృప చూపుము.


య: శుచి: ప్రయతో భూత్వా జుహుయాదాజ్య మన్వహమ్

శ్రియ: పంచదర్చం చ శ్రీకామ: సతతం జపేత్


 అగ్నిదేవా! ఎవరి వలన నేను ఎవరు లక్ష్మీదేవి కృప కొరకు ప్రార్తిస్తున్నారో, వారు ఇంద్రియాలు నిగ్రహించి, ప్రతిరోజూ ఆజ్యముతో హోమము చేయాలి. పైన తెలిపిన పదిహేను మంత్రాలను సదా జపిస్తూ ఉండాలి. 


ఆనన్ద: కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతా:

ఋషయస్తే త్రయ: పుత్రా: స్వయం శ్రీరేవ దేవతా

సుప్రసిద్ధులు, ఋషులు అయిన ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు ముగ్గురు ఈ సూక్తంలోని ఋషులు, మహాలక్ష్మియే దేవత. 


పద్మాననే పద్మ ఊరు పద్మాక్షీ పద్మసంభవే

త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్


పద్మము వంటి ముఖము, ఊరువులు, కన్నులు కలదానా! పద్మము నుండి ఉద్భవించిన తల్లి!, నేను దేని వలన సుఖాన్ని పొందుతానో దాన్ని ప్రసాదించు.


అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే

ధనం మే జుషతాం దేవి సర్వకామార్థ సిద్ధయే


 గుర్రాలను, గోవులను, సంపదలను ఇచ్చే, ధనానికి అధిదేవతయైన మహాలక్ష్మి! కోరికలన్నీ నెరవేరేటప్పుడు కలిగే సుఖాన్ని ఇచ్చే సంపదను నాకు ప్రసాదించు.


పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజావిగోరథమ్

ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మామ్

 పుత్రులు, గోవులు, ధనధాన్యాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు మొదలైన సకల సంపదలు ప్రసాదించు. జనులకు నువ్వు తల్లిగా భాసిస్తున్నావు. నన్ను ఆయుష్మంతునిగా చేయుము.


చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీమ్

చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ హహాలక్ష్మీ ముపాస్మహే 

ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు:

ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే

అగ్ని, వాయువు, సూర్యుడు, అష్టవసువులు, దేవేంద్రుడు, బృహస్పతి, వరుణుడు - తమ తమ సంపదలను నీ కృపతో అనుభవిస్తున్నారు. చంద్రునివలె చల్లగా, దేవతల శక్తిగా, సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తున్నది, శ్రీదేవి, ఈశ్వరి, చంద్రుడు, సూర్యుడు, అగ్ని - మువ్వురినీ తన మహత్తుగా కలదీ అయిన శ్రీమహాలక్ష్మిని కొలుస్తున్నాను.



వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహ

సోమం ధనస్య సోమినో మహ్యాం దదాతు సోమినీ


 ఓ గరుత్మంతుడా! సోమరసం కోసం వచ్చిన వృత్రాసురుని సంహరించిన ఇంద్రుడు సోమరసం గ్రోలనీ.  సోమయాగం నిర్వర్తించాలని సంకల్పించిన నాకు పుష్కలముగా ధనాన్ని ప్రసాదించనీ!


న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతి:

భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్సదా


 పుణ్యము చేసిన భక్తులకు కోపము రాదు, మాత్సర్యము ఉండదు, లోభము నశిస్తుంది, దుర్బుద్ధి పుట్టదు. భక్తిని పొంద కోరేవారు శ్రీ సూక్తాన్ని సదా జపము చెయ్యాలి.


వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుత:

రోహంతు సర్వభీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి


 నీ కృపతో మేఘాలు ఎల్లప్పుడూ వర్షించనీ! విత్తనాలు చక్కగా మొలకెత్తి బాగా పెరగనీ! భగవంతుని నిందించేవారు నిష్క్రమించు గాక!


పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి

విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ


 పద్మము అంటే ఇష్టపడేదానా! పద్మములు చేతిలో ధరించిన జగన్మాతా! పద్మములో జన్మించి, నివసించే తల్లీ! తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలిగి, విష్ణువు మనస్సుకు అనుకూలమైన మాతా! నీ పాదపద్మములతో నన్ను అనుగ్రహించు.


యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ

గంభీరా వర్తనాభి: స్తనభర నమితా శుభ్ర వస్తోత్తరీయా

పద్మము మీద ఆసీనురాలై ఉన్నదేవరో, విస్తారమైన పిరుదులు కలిగిన, తామర రేకులవంటి నేత్రములు కలవారెవరో, లోతైన నాభి కలిగి, స్తన భారముతో వంగి ఉన్న వారెవరో, స్వచ్చమైన వస్త్రాలు, ఉత్తరీయము ధరించిన దెవరో, 





లక్ష్మీర్థివ్యైర్గజేంద్రైమణిగణ ఖచితైస్స్నాపితా హేమకుంభై:

నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా


రత్నాలు పొదిగిన కలశాల జలంతో దేవలోకములోని అత్యుత్తమైన గజములతో అభిషేకించ బడుతున్న దెవరో, పద్మాన్ని చేత ధరించిన దెవరో, సర్వ మంగళ స్వరూపిణియైన దెవరో అట్టి మహాలక్ష్మి నా గృహములో సదా సర్వవేళలా నివసించుగాక! 


లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్

దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం

శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం


 భాగ్యానికి నిలయమనది, పాలకడలి నుండి ఉద్భవించినది, శ్రీరంగములో వెలసిన దేవీ, దేవ లోక స్త్రీల నందరిని దాసీజనంగా చేసుకొన్నది, లోకాని దీపంగా భాసిస్తున్నది, ఎవరి మృదుల కటాక్షంతో ఇంద్రుడు, శివుడు వైభవము పొందుతున్నారో, మూడు లోకాలను తన కుటుంబముగా చేసుకున్నది, తామర కొలనులో ఉద్భవించినది, మహావిష్ణువుకు ప్రియమైనది అయిన నీకు నమస్కరిస్తున్నాను.


సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ

శ్రీలక్ష్మీర్వర లక్ష్మీశ్చ ప్రసన్నామమ సర్వదా


 సిద్ధులను ఇచ్చే, ముక్తిని అనుగ్రహించే, విజయాన్ని సిద్ధింప చేసే లక్ష్మీ రూపాలలో, సరస్వతిగాను, సంపదలిచ్చే శ్రీదేవిగాను, వరాలిచ్చే వరలక్ష్మిగా నువ్వు సదా నాకు ప్రసన్నురాలవుగా ఉండుగాక!



వరాంకుశౌ పాశమభీతిముద్రాం

కరైర్వహంతీం కమలాసనస్థామ్  

బాలర్కకోటి ప్రతిభాం త్రిణేత్రాం 

భజేహమంబాం జగదీశ్వరీం తామ్  


 వర, అభయ ముద్రలు చేత దాల్చిన, పాశము, అంకుశములు చేత ధరించిన, పద్మములో నివసిస్తున్న    కోటి బాల సూర్యుల ప్రకాశము కలదీ, మూడు నేత్రములు కలదీ, ఆదిశక్తి, జగదీశ్వరి అయిన ఆమెను నేను స్తుతిస్తాను.                     



సర్వమంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్య్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే

శుభములలో శుభానివి, సకల శుభాలను సాధించి, ప్రసాదించే దానవు, శరణు పొందటానికి యుక్తమైన దానవు, మూడు కన్నులు కాలిగిన ఓ దేవీ, నారాయణీ! నా నమస్కారము.


మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్

శ్రీ ర్వర్చ స్వ మాయి ష్ మారో గ్యమావీ దాత్ పవమానం మహీయతే

దాన్యం దనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు:


 మహాలక్ష్మిని తెలుసుకుందాము. 


విష్ణుపత్నియైన ఆమెను అందుకై ధ్యానిద్దాం. ఆ లక్ష్మీదేవి మనకు ప్రేరణనిచ్చు గాక! మహాలక్ష్మీ! వర్చస్సు, లోటు లేని జీవితం, మంచి ఆరోగ్యం - నాకు ప్రసాదించే పవనాలు సదా వీచనీ. ధన ధాన్యాలు, పశు సంపద, పుత్రులు, నూరేళ్ళ దీర్ఘాయుష్షు నాకు చేకూరనీ.

                                                           -------------------

పద్మ వాసిని, పద్మమును చేత ధరించినది, పవిత్రమైన తెల్లని వస్త్రములు, సుగంధభరితమైన మాలను ధరించి శోభిస్తున్న, భగవతి, హరిపత్ని, కామ్యదాయిని, ముల్లోకాలను పోషించి కాపాడే నువ్వు నన్ను అనుగ్రహించు. విష్ణుపతిని, భూదేవి, తులసి గా అలరారుతున్నది, మాధవుని ప్రియురాలు, ప్రియసఖి, విష్ణువుతో కూడిన దేవీ! నేను నమస్కరిస్తున్నాను.

 ఋణము, రోగము, దారిద్ర్యము, ఆకలి, అకాల మరణము, భయము, శోకము, మానసిక వ్యథలు నశించు గాక!. శ్రీదేవి చేరే వారిని ఐశ్వర్యం వరిస్తుంది; సంపద, దీర్ఘాయుష్షు చేకూరుతుంది. వారు ఐశ్వర్యాలతో తులతూగుతూ మరణం లేని స్థితికి చేరుకుంటారు. సత్వరమే వారు కీర్తిని, విజయాన్ని పొందుతారు. మంచివి అన్నీ లక్ష్మే దేవియే - ఇలా తెలుసుకున్న వాడు లక్ష్మీ దేవిని చేరుకుంటాడు. మంత్రయుక్తముగా ఎల్లప్పుడూ యాగము చేయాలి. అలా చేసే వాడికి పుత్ర సంపద, పశు సంపద లభిస్తుందని గ్రహించాలి. 

_______________________________


http://lakshmistotras.blogspot.com/2016/02/srisuktam-with-telugu-meaning.html






Ud. 8.10.2024

Pub. 7.10.2021

1 comment: