https://www.kamakoti.org/telugu/
https://www.kamakoti.org/telugu/65/index.html
https://www.kamakoti.org/telugu/65/1.htm
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము
ప్రథమ ఖండము - ప్రకృతి ఖండము
ప్రథమోZధ్యాయః అనుక్రమణిక
(జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం | ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే||)
అథబ్రహ్మవైవర్తే బ్రహ్మఖండం -
బ్రహ్మవైవర్తపురాణములోని బ్రహ్మ, ప్రకృతి, గణపతి, శ్రీకృష్ణ జన్మఖండములనే నాలుగు ఖండములలో బ్రహ్మఖండము ప్రారంభింపబడుతున్నది.
https://www.kamakoti.org/telugu/65/12.htm
ద్వాదశోzధ్యయ: - నారదజన్మ కథనము
శౌనక ఉవాచ - శౌనకుడిట్లనెను -
ఋషి వంశ ప్రసంగేన బభూవుర్వివిధాఃకథాః l ఉపాలంభేన ప్రస్తావాత్కౌతుకేన శ్రుతా : మయా ll 1
ప్రజా వా ససృజు: కే వా ఊర్ధ్వరేతాశ్చ కశ్చన l పిత్రా సహ విరోధేన నారదః కిం చకార సః || 2
పితు ః శాపేన పుత్రస్య కిం బభూవ విదోధతః l పితుర్వా పుత్రశాపేన సౌతే తత్కథ్యతాం శుభం ll 3
ఓ సౌతిమహర్షీ ! ఋషి వంశముల గురించి చెప్పు సందర్భమున తెల్సి న వివిధకథలను ఉత్సాహముతో వింటిని . మహర్షులలో ఎవరెవరు సృష్టిక్రమమునకు పక్రమించిరి ? ఎవరు ఊర్ద్వరేతస్కులైరి ? తండ్రితో విరోధము పెట్టుకున్న నారదుడేమి చేసెను . బ్రహ్మ, బ్రహ్మతనయుడైన నారదుడు పరస్పరము శాపములిచ్చుకొని ఎమైనారో ఆకథనంతయు చెప్పుము -
No comments:
Post a Comment