సంక్రాంతి: మంచి మార్పు
సంక్రాంతి శుభాకాంక్షలు
సంక్రాంతి వస్తోంది
సందడెంతో తెస్తుంది
సంబరాలు చెయ్యాలి
సిద్ధంగా ఉన్నావా సోదరా
నీ పంట చేతికి వచ్చిందా సోదరా || సంక్రాంతి వస్తోంది సోదరా ||
భోగి పండుగ వస్తుంది
చలిమంట మాట తెస్తుంది
పిడకలెన్నో కావాలి
సిద్ధంగా ఉన్నావా సోదరా
పశువులెన్నో పెంచావా సోదరా || సంక్రాంతి వస్తోంది ||
పెద్ద పండుగ వస్తుంది
చుట్టాల్నింటికి తెస్తుంది
పిండివంటలు చెయ్యాలి
సిద్ధంగా ఉన్నావా సోదరా
సరుకులన్నీ తెచ్చావా సోదరా || సంక్రాంతి వస్తోంది ||
కనుమ వెంటగ వస్తుంది
కాస్త తీరిక తెస్తుంది
మినప సున్ని చెయ్యాలి, గార్లెన్నో వండాలి
సిద్ధంగా ఉన్నావా సోదరా
నూని గింజలు పెంచావా సోదరా || సంక్రాంతి వస్తోంది ||
పండుగలు వస్తాయి, సంతోషం తెస్తాయి
మండుటెండ కష్టానికి ఫలితం చూపెడతాయి
కండ కరిగించి, మెదడు నొప్పించి పనులెన్నొ చేయాలి
పంటలు వంటలు దండిగా పెంచాలి
సిద్ధమంటే అదేరా సోదరా || సంక్రాంతి వస్తోంది ||
నారాయణ రావు
14 January 2017
No comments:
Post a Comment