మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు.
వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు.
ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు.
ఈ రోజు సరస్వతి దేవికి పూజ చేయవలెను.
వసంత పంచమి విశిష్టత
సరస్వతీదేవిని మాఘపంచమినాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు.
ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది.
(బ్రహ్మవైవర్తపురాణం - hindi) (బ్రహ్మవైవర్తపురాణం - English)
ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.
అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథినాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు.
‘‘చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా’’ అని ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని, సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.
సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.
https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%B8%E0%B0%82%E0%B0%A4_%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%AE%E0%B0%BF
_________________
_________________
Sri Saraswathi Ashtothara Shatanama Stotram
https://www.youtube.com/watch?v=831khTU2LjU
శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామ స్తోత్రం
సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా ।
శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రగా ॥ ౧ ॥
శివానుజా పుస్తకధృత్ జ్ఞానముద్రా రమా పరా ।
కామరూపా మహావిద్యా మహాపాతకనాశినీ ॥ ౨ ॥
మహాశ్రయా మాలినీ చ మహాభోగా మహాభుజా ।
మహాభాగా మహోత్సాహా దివ్యాంగా సురవందితా ॥ ౩ ॥
మహాకాళీ మహాపాశా మహాకారా మహాంకుశా ।
సీతా చ విమలా విశ్వా విద్యున్మాలా చ వైష్ణవీ ॥ ౪ ॥
చంద్రికా చంద్రవదనా చంద్రలేఖావిభూషితా ।
సావిత్రీ సురసా దేవీ దివ్యాలంకారభూషితా ॥ ౫ ॥
వాగ్దేవీ వసుధా తీవ్రా మహాభద్రా మహాబలా ।
భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా ॥ ౬ ॥
జటిలా వింధ్యవాసా చ వింధ్యాచలవిరాజితా ।
చండికా వైష్ణవీ బ్రాహ్మీ బ్రహ్మజ్ఞానైకసాధనా ॥ ౭ ॥
సౌదామినీ సుధామూర్తిస్సుభద్రా సురపూజితా ।
సువాసినీ సునాసా చ వినిద్రా పద్మలోచనా ॥ ౮ ॥
విద్యారూపా విశాలాక్షీ బ్రహ్మజాయా మహాఫలా ।
త్రయీమూర్తీ త్రికాలజ్ఞా త్రిగుణా శాస్త్రరూపిణీ ॥ ౯ ॥
శుంభాసురప్రమథినీ శుభదా చ సర్వాత్మికా ।
రక్తబీజనిహంత్రీ చ చాముండా చాంబికా తథా ॥ ౧౦ ॥
ముండకాయప్రహరణా ధూమ్రలోచనమర్దనా ।
సర్వదేవస్తుతా సౌమ్యా సురాసురనమస్కృతా ॥ ౧౧ ॥
కాళరాత్రీ కళాధారా రూపసౌభాగ్యదాయినీ ।
వాగ్దేవీ చ వరారోహా వారాహీ వారిజాసనా ॥ ౧౨ ॥
చిత్రాంబరా చిత్రగంధా చిత్రమాల్యవిభూషితా ।
కాంతా కామప్రదా వంద్యా విద్యాధరా సుపూజితా ॥ ౧౩ ॥
శ్వేతాసనా నీలభుజా చతుర్వర్గఫలప్రదా ।
చతురాననసామ్రాజ్యా రక్తమధ్యా నిరంజనా ॥ ౧౪ ॥
హంసాసనా నీలజంఘా బ్రహ్మవిష్ణుశివాత్మికా ।
ఏవం సరస్వతీ దేవ్యా నామ్నామష్టోత్తరశతమ్ ॥ ౧౫ ॥
https://sakalam.org/saraswati-ashtottara-stotram-in-telugu/
No comments:
Post a Comment