Sunday, March 3, 2019

Maha Shivratri - Telugu - మహా శివరాత్రి - శివ దర్శనము, శివ పూజ, రుద్రాభిషేకము, జాగరణ

4 మార్చి 2019

శివరాత్రి శివభక్తి – శివరాత్రి శివపూజ - శివరాత్రి జాగరణ 

శివలోక ఫలమిచ్చు శివమెక్కి చేయరే  


శివ శివా శివ శివా


Shivratri Worship - According to Shiv Puran As Told by Parama Shiva himself
___________________


___________________


Picture taken at Chinmaya Temple, Powai, Mumbai on 7 March 2016 - Shivratri Day.

మహా శివరాత్రి


శివ లింగము ఉద్భవించిన రొజు. శివపార్వతుల కళ్యాణము జరిగిన రొజు. అమృత మతనములో జనించిన హాలాహలాన్ని శివుడు మ్రింగిన రొజు. శివుని అర్చించడానికి అతి చక్కని రోజని వేరే చెప్పనవసరము లెదు.

శివ దర్శనము, శివ పూజ, రుద్రాభిషేకము, ఉపవాసము, జాగరణ ఈనాటి కార్య్క్రమాలు.

ఉపవాసము -  భగవత్ సహవాసము


ఉపవాసము  అంటే పూర్తిగా ఆహారము మానేసి ఉండాలి అనే ఆలోచన చాలా మంది లో ఉన్ది.
కాని ఇప్పుడు కొంతమంది ఆచార్యులు ఉపవాసము  అంటే పూర్తిగా ఆహారము మానివేయడము కాదు దేవుని సహవాసం ఎక్కువ చెయ్యడం అని చెబుతున్నారు.  ఉపవాసము అనడం కన్నా భగవత్ సహవాసము అంటే ప్రజలకు బాగా అర్థమవుతున్ది.

భగవంతుడు అంటే ఎవరు?

నిరాకార స్వరూపము
ప్రతి జీవిలోనూ ఉన్న ఆత్మా నిరాకార భగవత్ స్వరూపము.



శివరాత్రి  ప్రాముఖ్యత

__________________

__________________
Bhakti TV

__________________

__________________
Bhakti TV

శివరాత్రి శివుని చూసి వద్దాము రండి



శివరాత్రి శివుని చూసి వద్దాము రండి
లింగాభిషేకం చేసి వద్దాము రండి
శివ మహిమ గాధలు విందాము రారండి
శివ పూజ  పుణ్యము పొంద కదలండి   ॥ శివరాత్రి శివుని ॥

శివుడు పుట్టిన రోజు నేడే అని కొందరు
లింగోద్భవము కూడా జరిగెనని కొందరు
శివ రాత్రి గాధలు యుగ యుగాల వింతలు
దినమంత విందాము భజనలు చేద్దాము  ॥ శివరాత్రి శివుని ॥

దక్ష ప్రజాపతి గారాల బాల శివసతిగ  మారె
దక్ష యజ్ఞము లోన జరిగె  సతి మరణము
హిమవంత తనయగా ఆదిశక్తి జననము
అత్యధ్బుతమైన శివపార్వతీ పరిణయము   ॥ శివరాత్రి శివుని ॥

శివ రాత్రి గాధలు యుగ యుగాల వింతలు
దినమంత విందాము భజనలు చేద్దాము
భగవదారాధనకు అతి పుణ్య దినము
శివరాత్రి శివునకు అతి ప్రీతికరము  ॥ శివరాత్రి శివుని ॥

అమర ఆనందము అమృత పానము
పొంద చేసిరి  విశ్వ సముద్ర మదనము
విలువైన వస్తువులు వేల వేలు వచ్చే
ప్రలయధ్వనితో పుట్టె హాలాహల జ్వాల  ॥ శివరాత్రి శివుని ॥

రక్షించు రక్షించు దేవుడా దేవుడా
విశ్వమంతా అరిచే వినాశము జరిగె
భక్షించు భాద్యత శివుని వంతయ్యె
కడలి వచ్చెను శివుడు శివరాత్రి తిధిని  ॥ శివరాత్రి శివుని ॥

గరళము చేపట్టి నోటి లోపల పెట్టి
గుట కేసె  ఈశ్వరుడు  ప్రమదాది నాధుడు
గొంతులోనే పెట్టి కదలకుండగా చేసి
గరళాన్ని శాసించె కైలాస వాసుడు  ॥ శివరాత్రి శివుని ॥

శివ గరళ యద్ధము జరిగిన రాత్రి
శివగణములన్ని నిదురించని రాత్రి
ప్రకృతిపై పరమాత్మ విజయసంకేత రాత్రి
శివరాత్రి మనకు ఒక దివ్య రాత్రి  ॥ శివరాత్రి శివుని ॥


నమశ్శివాయ నామములు


శివరాత్రి శివునకు అంకితము  17 ఫిబ్రవరి 2015 జయ నామ సంవత్సరము
కంభంపాటి నారాయణ రావు.


నమశ్శివాయ  నమశ్శివాయ
నందివాహన నమశ్శివాయ

కైలాసవాసా నమశ్శివాయ
కాశీ విశ్వనాధా నమశ్శివాయ
కాళహస్తీశ్వర నమశ్శివాయ
కాలకూటహర  నమశ్శివాయ
కన్నప్ప వరదా నమశ్శివాయ
కరుణాన్తరంగా నమశ్శివాయ
గణపతిజనకా నమశ్శివాయ
గరళ కంటా నమశ్శివాయ
గంగాధరా నమశ్శివాయ
గురురాజోత్తమ నమశ్శివాయ

నమశ్శివాయ  నమశ్శివాయ
నందివాహన నమశ్శివాయ

చంద్రకళాధర నమశ్శివాయ
చంద్రమౌలీశ్వర నమశ్శివాయ
జటాజూటధర నమశ్శివాయ
జగదీశ్వరా నమశ్శివాయ
డమరుకవాదన నమశ్శివాయ
డాకిన్యేశ్వర నమశ్శివాయ
త్రిపురాంతకా నమశ్శివాయ
త్రయంబకేశ్వర నమశ్శివాయ
త్రిమూర్తిరూపా నమశ్శివాయ
త్రిపురసున్దరినాధా నమశ్శివాయ
తాన్డవప్రియా  నమశ్శివాయ
తాపత్రయనాశన నమశ్శివాయ
త్రిశూలహస్తా నమశ్శివాయ


నమశ్శివాయ  నమశ్శివాయ
నందివాహన నమశ్శివాయ

దక్షదర్పహర నమశ్శివాయ
ద్రాక్షేరేశ్వర నమశ్శివాయ
నాగాభరణా నమశ్శివాయ
నీలకంటా నమశ్శివాయ
నటరాజా నమశ్శివాయ
నాట్యవిశారద నమశ్శివాయ
పార్వతినాధ నమశ్శివాయ
పరమేశ్వరా నమశ్శివాయ
పరమదయాలా నమశ్శివాయ
పరమశివా నమశ్శివాయ

నమశ్శివాయ  నమశ్శివాయ
నందివాహన నమశ్శివాయ

భీమేశ్వరా నమశ్శివాయ
భీషణయోద్దా  నమశ్శివాయ
మ్రుత్యుంజయెశ్వర నమశ్శివాయ
మార్కండేయ రక్షక నమశ్శివాయ
యోగేశ్వారా నమశ్శివాయ
యోగి పూజ్యా నమశ్శివాయ
యజ్నేశ్వారా నమశ్శివాయ
యాగధ్వన్శక నమశ్శివాయ
రాగాతీతా నమశ్శివాయ
రుద్రరూపా నమశ్శివాయ

నమశ్శివాయ  నమశ్శివాయ
నందివాహన నమశ్శివాయ


లయకారకా నమశ్శివాయ
లింగరూపా నమశ్శివాయ
విశ్వేశ్వరా నమశ్శివాయ
విఘ్నేశ్వర జనకా నమశ్శివాయ
శ్రిశైలవాసా నమశ్శివాయ
శివరాత్రిదేవా నమశ్శివాయ
శంభోశంకర నమశ్శివాయ
శంకరమట స్థిత నమశ్శివాయ
శ్రీనాధార్చిత నమశ్శివాయ
సోమేశ్వరా నమశ్శివాయ
సుందరరూపా నమశ్శివాయ
సుందరేశ్వరా నమశ్శివాయ
సర్వేశ్వరా నమశ్శివాయ

నమశ్శివాయ  నమశ్శివాయ
నందివాహన నమశ్శివాయ

హరహర ఓంహర నమశ్శివాయ
హాలాహల భక్షక నమశ్శివాయ
అర్ధనారీశ్వర నమశ్శివాయ
అరివీరభయంకర నమశ్శివాయ
అర్జున పరీక్షక నమశ్శివాయ
అమరేశ్వారా నమశ్శివాయ
ఆశ్రితరక్షక నమశ్శివాయ
ఆనందదాయక నమశ్శివాయ
ఆదిశంకర స్తుత నమశ్శివాయ
ఉమానాధా నమశ్శివాయ


ఈనాటి భక్తి దిన చర్యలో ఉపయోగించే కొన్ని యుట్యూబ్ వీడియోలను క్రింద ఇస్తున్నాను.



నమకము - చమకము 

Namakam Chamakam
________________

________________
అమూల్య
Amulya Audios and Videos



Shiva Sahasranama Stotram
________________

________________
Bhakti One



Siva Ashtothara Satha Namavali (Telugu)
_________________

_________________
Hitokthi Telugu


Jyotirlinga Darshanam

జ్యోతిర్లింగ దర్శనము చెయ్యండి 

__________________

__________________
T-Series Bhakti Sagar



Sri Kashi Darshanam

శ్రీ కాశీ దర్శనము 

__________________

__________________
T Series Bhakti Sagar


Shiva Stuti Stotrams - S.P. Balasubrahmanyam
________________

________________
Bhakti upload

Sivarchana - S.P. Balasubrahmanyam
________________

________________
Bhakti


Shiv Shiva Shankara - Aditya Music Collection
_________________

_________________


శివ చరిత్ర - పాట

_______________

_______________
Amulya Audios and Videos


Shivoham - Film Scenes
_______________

_______________
Telugu One


Bhakta Kannappa - Full Film
_______________

_______________
Telugu One




Updated  2019 - 3 మార్చి,  2018 - 13 February
 4 March 2016, 16 Feb 2015

No comments:

Post a Comment