ధర్మం అనే పదానికి నానార్ధములు ఉన్నాయి.
పురుషార్థములు
ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే చతుర్విధములైన పురుషార్థాలను ప్రతి పురుషుడు సాధించాలి.
పురుషార్థమైన ధర్మం అంటే వృత్తి. అంటే దాని అర్థం చదువుకోవటం, వృత్తి విద్యను నేర్చుకోవడం. ప్రతీ మనిషి ఒక వృత్తిని అంటే జీవితమునకు ఉపయోగపడే పనిని నేర్చుకోవాలి.
(ధర్మము అంటే వృత్తి)
పురుషార్థమైన అర్థం (ధనం) అంటే ప్రతి పురుషుడు తాను, తన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవితం గడపడానికి అవసరమైనంత ధనం సంపాదించాలి. తాను నేర్చుకున్న ధర్మాన్ని అర్ధము లభించే విషయాలలో వినియోగించాలి.
పురుషార్థమైన కామం అంటే ఒక వ్యక్తి యొక్క సొంత కోరికలు తీరటం. తన సంపాదన నుండి మొదట తన కోరికలు గలగాలి.
పురుషార్థమైన మోక్షం అంటే తన ఆత్మని, మనస్సుని, శరీరాన్ని తృప్తి పరచుకోవడమే కాకుండా పర ఆత్మలను, పరమాత్మను తృప్తి పరచడం. ఇతరులకు తోడుపడ కుంటా ఎవరి జీవితం కూడా వెళ్ళదు. ఆ విషయాన్నే ఈ పురుషార్థము ప్రత్యేకముగా సూచిస్తోంది.
ధర్మము అంటే ఏమిటి
1. జ్ఞానము 2. ప్రేమ 3. న్యాయము 4. అంకిత స్వభావము 5. ధైర్యము ఇవి ఉన్నప్పుడు ధర్మము ఉంటుంది
‘ధర్మం’ అంటే ఏమిటి?by నాగవరపు రవీంద్ర
శ్లో|| ధృతిః క్షమా దమో స్తేయం, శౌచమింద్రియ నిగ్రహః|
హ్రీర్విద్యాసత్య మక్రోధః ఏతత్ ధర్మస్త్య లక్షణమ్||
“ధృతి – క్షమ – దమం – అస్తేయం – శౌచం – ఇంద్రియ నిగ్రహం – హ్రీః (సిగ్గు) – విద్య – సత్యం – అక్రోధం”, ఈ పది లక్షణాలు కలిగియున్న ధర్మమని శాస్త్రం చెబుతోంది.
____________________
____________________
Siva Kesava
ధర్మం అంటే ఏమిటి? Webdunia.com
ధర్మము సమాజ శ్రేయస్సును పెంచుతుంది
"ధర్మం", ఈ పదానికి, ఈ భావనకు భారతీయ (హైందవ) మతాలలో (సనాతన, బౌద్ధ, జైన, శిఖ్ఖు ) చాలా అర్ధాలుఉన్నాయి.
సనాతన ధర్మం ప్రకారం " ఏ ప్రవర్తనా నియమావళి , మూల సూత్రాలు , మరియ ఏ న్యాయము చేత వ్యక్తి గత , సామాజిక , మతపర జీవితం సజావుగా నడపబడుతుందో , ఏ కారణము చే సర్వ జీవజాలం , ప్రకృతి లోని ప్రతి పదార్థం , శక్తి ఒక దానితోనొకటి అనుసంధానించబడి మనుగడ సాదిస్తాయో , ఏ కారణము చే ఈ ప్రపంచము , బ్రహ్మాన్డ మండలం తమ ఆస్తిత్వాన్ని నిలుపుకుంటున్నాయో , అట్టి దానిని ధర్మము గా నిర్వచించారు.
సమాజములో ప్రతీ వ్యక్తి ధర్మాన్ని పాటిస్తే సమాజ శ్రేయస్సు అత్యధికముగా ఉంటుంది. ఒక వ్యక్తి ధర్మాన్ని పాటించక పొతే అది చూసిన్ల, విన్న ఇంకొక వ్యక్తి కూడా అధర్మాన్ని చేసే అవకాశము పుడుతుంది. అధర్మము పెరుగుతుంది. సమాజ అభివృద్ధి తగ్గుతుంది.
ధర్మాన్ని పాటించు - ధర్మాన్ని రక్షించు అని అందరూ ఒకరికి ఒకరు చెప్పుకోవడము వారి శ్రేయస్సు కొరకే.
ధర్మము - న్యాయము
న్యాయము అంటే ఇంగ్లీషులో 'law' గా అర్ధము చెప్పు కోవచ్చు. ఒక విషయము జరిగితే ఇంకో విషయము జరుగుతుంది (ఖఛ్చితముగా గాని, ఎక్కువ సంభావ్యతతో గాని) అని చెప్పేదాన్ని న్యాయము అని చెప్పాచ్చు. ఇంతవరకు ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలా జరగాలి అని చెప్పేది కూడా న్యాయమే.
న్యాయము నకు ఇహలోకమందు దృష్టి ధర్మమునకు పరలోకమందు,
https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Veemana,_Rallapalli_Ananthakrishna_Sharma.pdf/63
మీ అభిప్రాయాన్ని చెప్పండి.
No comments:
Post a Comment