భారతీయులం మనం
భరత మాత ముద్దు బిడ్డలం
సహోదరీ సహోదరులం
ఒకే మట్టి లోని విత్తనాల మొక్కలం ॥ భారతీయులం మనం ॥
చదువులు వేరైనా చేయు పని ఏదైనా
ఇష్ట దైవమెవరైనా పారాయణ స్తోత్రమేదైనా
వంటలన్ని వేరైనా వేషభాషలు మారైనా
మాట తీరు మారినా మనిషి రంగు మారినా ॥ భారతీయులం మనం ॥
పరిపాలన సౌలభ్యం ప్రాంతాలు నాడులు
మిత ప్రయాణం కోసం గ్రామ స్థాయి సంస్థలు
ఉత్సాహం పెంపుకే పోటీలు పందాలు
ఆలోచన కోసం వేరు వేరు పక్షాలు ॥ భారతీయులం మనం ॥
మనమంతా ఒక్కటే
ఐకమత్యమే మన బలం
కలిసి ఉంటేనే సుఖం
కాదంటే కలహం దుఃఖం ॥ భారతీయులం మనం ॥
ఇది ఏకాత్మ భావం పరమాత్మ తత్త్వం
అద్వైతం విశిష్ట అద్వైతం
శుద్ధ అద్వైతం యుగానుకూల వచనము
మన ఋషుల దర్శనం మానవాళి మంచికి మార్గం ॥ భారతీయులం మనం ॥
Bhaarateeyulam manam
Bharata maata muddubiddalam
Sahodari sahodaralam
Oke mattiloni vittanaala mokkalam ||Bhaarateeyulam manam||
Chaduvulu veraina cheyu pani edaina
Ishta daiva mevaraina paaraayna stotramedaina
Vantalanni veraina veshabhashalu maaraina
Maata teeru maarinaa manishi rangu maarinaa ||Bhaarateeyulam manam||
Paripalana sowlabhyam praantaalu naadulu
Mita prayanam kosam graamaasthaayi sansthalu
Utsaaham pempukai poteelu pandaalu
Alochanakosam veru veru pakshaalu ||Bhaarateeyulam manam||
Excellent sir
ReplyDeleteThank you.
DeleteJai hind
ReplyDelete