Saturday, April 13, 2019

Dr. B.R. Ambedkar in Telugu - భీంరావ్ అంబేడ్కర్




అంబేడ్కర్ 



భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన మహోం అను ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో)  రాంజీ మలోజీ సాక్పాల్ మరియు భీమాబాయ్ దంపతుల 14 వ మరియు చివరి సంతానంగా జన్మించాడు.

రామ్‍జీ కుటుంభం  పిల్లల చదువుకోసం బొంబాయి చేరింది. . భీమ్‌రావ్ ఎల్‌ఫిన్‌స్టన్ హైస్కూల్ లో చేరి మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో నెగ్గాడు.  పై చదువులు చదవాలన్న పట్టుదలవల్ల  మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువుపూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయం చేరాడు. 1915లో ఎం.ఏ. 1916లో పి.హెచ్.డి. డిగ్రీలను సంపాదించాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ల తర్వాత "ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా" అను పేరుతో ప్రచురించబడింది. 1917 లో డాక్టర్ అంబేద్కర్‍గా స్వదేశం వచ్చాడు.  1916-1917 కాలంలో ఆయన ఇంగ్లాన్డ్ లో కూడా పరిశోధన మొదలు పెట్టారు. అందువలన ఆయన తిరిగి ఇంగ్లాన్డ్కి వెళ్లి పరిశోధన పూర్తి చేసి D.Sc. పట్టా పొందారు. 

భారత్ దేశములో ఆయన కులవ్యవస్థ వాళ్ళ వస్తున్న ఇబ్బందులను, హేళనలను, అవమానాలను ఎదుర్కొంటూ   ఆయన తన వృత్తిని చేసుకుంటూ ఆ వ్యవస్థని మార్చే ఉద్యమాన్ని చేపట్టారు. 

తెలుగులో అంబేడ్కర్ ఉపన్యాసాలు పుస్తకాలు  అనువాదము   బడ్డాయి. 
తెలుగు విశ్వ విద్యాలయ అంతర్జాల స్థలము నుండి ఆ పుస్తకాలను మీరు మీ కంపూటరు లోనికి దించుకోవచ్చు. 

http://teluguuniversity.ac.in/dr-b-r-ambedkar-writing-speeches/

14 ఏప్రిల్ 2019 పైన ఇచ్చిన అంతర్జాల లంకె ఇప్పుడు కూడా పని చేస్తోంది. ఆ పుస్తకాలను తప్పక చదవండి.


13 April 2017 Discussion on Ambedkar's Contribution to Constitution
___________________


___________________
ETV Andhra Pradesh


Ambedkar is a great thinker - Speech by Shri Chandrababu Naidu, CM, Andhra Pradesh
___________________


___________________

 

Updated 14 April 2019, 13 April 2017

No comments:

Post a Comment