Thursday, October 15, 2015

Dr. Suri Bhagavantam in Telugu

డా!సూరి భగవంతం (14  అక్టోబర్ 1909 - 6 ఫిబ్రవరి 1989)


సూరి భగవంతం కృష్ణాజిల్ల ఆకిరిపల్లి గ్రామంలో ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించారు.వీరి పాఠశాల కళాశాల విద్య అంతా నిజాం రాష్ట్రంలో జరిగింది.మెట్రిక్యులేషన్,బి.ఎస్సీలలో ప్రధమ శ్రేణిలో ప్రధమ స్థానం సంపాదించారు.మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్సీ డిగ్రీ పొందారు.తరువాత కలకత్తాలో ప్రఖ్యాత వైజ్ఞానికుడు సి.వి.రామన్ గారి దగ్గర శిష్యరికం చేశారు.

1932లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలొ అధ్యాపకునిగా చేరారు.అప్పటికి ఆయన వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే.1938 నాటికి ఆయన ప్రోఫెసర్ అయ్యారు. అంటే వారి 28వ సంవత్సరంలో ప్రొఫెసర్ పదవిని చేపాట్టారు.ఆయన పరిశోధనా పటిమకు గాని ఆంధ్రవిశ్వవిద్యాలయము ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది.1948-50ల మధ్య లండన్ లో ఇండియన్ సైంటిఫిక్ లైజాన్ ఆఫీసర్ గా పనిచేశారు.

1952-57ల మధ్య ఊస్మానియా యూనివర్సిటి వైస్-చాన్సలర్ గా పనిచేశారు.అంటే 42 సంవత్సరాల పిన్న వయస్సులో ఆపదవిని చేపట్టారు.అది ఆయన ప్రతిభకు తార్కాణం. 1957లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(బెంగుళూరు) కు డైరెక్టర్ గా నియమితులయ్యారు. 1961 వరకు ఆ పదవిలో వున్నారు.ఆ తర్వాత కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు సైంటిఫిక్ అడ్వైజర్ గా నియమితులయ్యారు.డిఫెన్స్ రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి.ఓ) కు కూడా డైరక్టర్ గా వ్యవహరించి దానిని అత్యుత్తమ సంస్థగా తీర్చిదిద్దారు.మిస్సైల్స్,ఏరో ఇంజన్స్,ఎలక్ట్రానిక్ యుద్ద పరికరాల నిర్మాణ వంటి రంగాలలో పరిశోధనలకు ఆయన నేత్రుత్వం వహించారు.1961లో 'క్రిస్టల్ సిమెట్రి అండ్ ఫిసికల్ ప్రోపర్టీస్" అనే గొప్ప గ్రంధాన్ని వెలువరించారు. రామన్ ఎఫెక్ట్ పై విస్త్రుతమైన పరిశొధనలు చేశారు.పలు విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్ లు ప్రధానం చేశాయి.

ఆయన 1989 ఫిబ్రవరి 6న కన్నుమూశారు.

No comments:

Post a Comment